![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. హౌస్ లో ఎవరు ఎలా ఆడుతున్నారోనని కంటెస్టెంట్స్ కి క్లారిటీ మిస్ అయింది. బిగ్ బాస్ సీజన్-8లో శివాజీ కూడా బాగా హైలైట్ అయ్యాడు. అది చూసే సీజన్-9 బజ్ ఇంటర్వ్యూలకి అతడిని యాంకర్ గా తీసుకొచ్చాడు బిగ్ బాస్. అయితే ఎవరూ ఊహించని విధంగా సండే ఎపిసోడ్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యింది.
బజ్ ఇంటర్వ్యూలో ప్రియా శెట్టిని యాంకర్ శివాజీ ఏం అడిగాడో ఓ సారి చూసేద్దాం. ప్రియా శెట్టి ఎంట్రీ ఇవ్వగానే ప్రియా శెట్టి ఎదురుగా శివాజీ కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడు.. వెంటనే ఇలా కూర్చుంటే బాలేదు కదా అని ప్రియాను శివాజీ అడిగాడు.. దానికి ప్రియా కూడా బాలేదు సర్ అని చెప్పింది. వెంటనే బిగ్ బాస్ లో ప్రియా శెట్టి, హరీష్, కళ్యాణ్ కూర్చున్న ఫోటోను చూపించాడు. ఫోటోను చూపించి అక్కడ అందరూ ఎలా కూర్చున్నారు.. మీ ముగ్గురు ఎలా కూర్చున్నారని అడిగాడు. అలా మీరు నాగర్జున గారి ముందు కూర్చోకపోయిన ఆడియన్స్ ముందు కూర్చున్నట్లే అని క్లారిటీ ఇచ్చాడు శివాజీ. మీరేమో మాట్లాడితే కామనర్స్, సెలబ్రిటీస్ అని టాపిక్స్ తీస్తారు. అగ్నిపరీక్షలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు, షోలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు.. మొత్తం కలిసి రెండు నెలలు ఉన్నామని ప్రియా శెట్టి చెప్తుంది. ఇప్పుడు మీరు సెలబ్రిటీ కాదా అని శివాజీ అటిగాడు. మీరు సెలబ్రిటీ కాదు అనుకుని ఇలా బిహేవ్ చేశారంటే, ఒకవేళ సెలబ్రిటీ అయితే ఇంకెలా బిహేవ్ చేస్తారని శివాజీ అన్నాడు.
అసలు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారని శివాజీ అడుగగా.. విన్ అవ్వాలని అని ప్రియా శెట్టి చెప్తుంది. విన్ అవ్వడం కోసం అసలు ఏం చేశారని మళ్ళీ అడిగాడు శివాజీ. సైలైంట్ అయిపోయింది ప్రియా శెట్టి. హౌస్ లో ఎవరిని ఏమీ చెప్పనీయకుండా అందరి మీద అరిచారని శివాజీ అడుగుతాడు. అందరు నన్ను తొక్కేశారని ప్రియా అనడంతో నీ వాయిస్ తో ఆడియన్స్ ని తొక్కేశావని నాగార్జున అంటాడు. ఇలా బిగ్ బాస్ సీజన్-9 లో శివన్న యాంకరింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |